కళకళం రేపిన కాల్పులు..

– ట్రాన్స్ ఫార్మర్ లోని రాగి తీగను దొంగలించే ముఠా..
–  రెండు రౌండ్ల కాల్పులు జరిపిన పోలీసులు..
– కారు వదిలి పారిపోయిన దొంగలు.. అన్ని పోలిస్ స్టేషన్ లో అలార్ట్.. పోలీసుల విసృతంగా గాలింపు…
నవతెలంగాణ – డిచ్ పల్లి
గత కొన్ని రోజులుగా వ్యవసాయ పంట పొలాల్లోని ట్రాన్స్ఫర్ లను ధ్వంసం చేస్తూ ఇటు రైతులకు అటు పోలీసులకు కునుకు లేకుండా చేస్తున్న ఈ దొంగల ముఠాను పట్టుకోవడానికి గత రెండు నెలల నుండి పోలీసులు గాలింపు చేపట్టారు దానిలో భాగంగానే  ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై ముగ్గురు సీఐలు, నల్గురు ఎస్సైలు, పోలిస్ సిబ్బంది తో కలిసి రోడ్డుపై బారికేడ్లను పెట్టి వాహనలను తనిఖీలు చేస్తు అనుమానం ఉన్న కారు కోసం కాపు కాశారు. రాజస్థాన్ దొంగల ముఠా కారును ఆపకుండా బారికేడ్లను కారుతో ఢీకొట్టారు.దీంతో కారును ఆపిన వెంటనే దాదాపు 4నుండి ఐదుగురు గల సభ్యుల ముఠా పారారయ్యారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. వ్యవసాయ క్షేత్రాల వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫార్మర్ లోని కాపర్ వైర్ ను ఈ ముఠా చోరికి పాల్పడుతున్నారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు సైతం నమోదు కావడంతో పోలీసులు ఈ మూటను పట్టుకోవడానికి ఆ రోజు నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో జరిగిన దొంగతనాల్లో ఒక కారును పోలీసులు అనుమానించారు ఆ కారు ఆదివారం రాత్రి ముప్కాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు సంచరిస్తున్నట్లు అన్ని పోలీస్ స్టేషన్లో సమాచారం ను జిల్లా పోలిస్ ఉన్నతాధికారులు అలార్ట్ చేయడంతో దానిలో భాగంగానే టాస్క్ ఫోర్స్, సిసిఎస్, ధర్పల్లి సిఐలతో పాటు డిచ్ పల్లి, ఇందల్వాయి, జాక్రన్ పల్లి, దర్పల్లి ఎస్ ఐలు, పోలీస్ సిబ్బంది తో కలిసి ఇందల్ వాయి పోలిస్ స్టేషన్ పరిధిలోని అతంగ్ టోల్ ప్లాజా సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీల చేపట్టారు. దానిలో భాగంగానే సోమవారం అర్ధరాత్రి మూడు గంటల సమయంలో అనుమానం ఉన్న రాజస్థాన్ రాష్ట్రం కు చెందిన కర్ పాసింగ్ ఉండడం గమనించిన ధర్పల్లి ఎస్సై వంశీ కృష్ణ రెడ్డి కారుని ఆపే ప్రయత్నం చేయగా పక్కనే ఉన్న భారీకేట్లను కారు డి కొంటూ పారిపోయింది. వెంటనే ఎస్సై వంశీకృష్ణారెడ్డి గాల్లో రెండు రౌండ్ల కాల్పులు జరిపిన వెంటనే అక్కడ ఉన్న పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వారి కారు ను పట్టుకోవడానికి పోలీసులు వెంబడించిన వేగంగా కారు సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లుపేట వద్ద కారు వదిలేసి మూఠ కు సంబంధించిన నలుగురు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. పారిపోయిన దొంగల కోసం పోలీసులు టీంలుగా ఏర్పడి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రాజస్థాన్ దొంగల ముఠా గా పోలీసులు అనుమానిస్తున్నారు. సదాశివ నగర్ మండలంలోని మల్లుపేట వద్ద కారు ను గుర్తుతెలియని వదిలి వేల్లిన కొద్దిసేపటికి పోలీసులు మల్లు పేట చేరుకొని కారును స్వాధీనం చేసుకొని ఇందల్ వాయి పోలీస్ స్టేషన్కు తరలించారు. ధర్పల్లి ఎస్సై వంశీకృష్ణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో కేసు ఆ మూటపై దర్పల్లి ఎస్ ఐ వంశీకృష్ణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఇందల్వాయి డిచ్పల్లి ధర్పల్లి పోలీస్ స్టేషన్లలో ట్రాన్స్ఫార్మర్ల ధ్వంసం పై కేసులు నమోదయి ఉన్నాయి కేసుల్లో ఈ కారులోని వచ్చి వారు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Spread the love