శాస్త్రి మృతి పట్ల కళాకారుల సంతాపం..

Artists mourn the death of Shastri.– సినారె కళామందిరంలో అయన చిత్రపటానికి నివాళులు అర్పించిన కళాకారులు..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలోని సినారె కళామందిర్ లో  గురువారం పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట సచ్చిదానంద శాస్త్రి మృతి పట్ల కళాకారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, రెండు నిమిషాల మౌనం పాటించారు.  అనంతరం  తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల ఫోరం, కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్  యెల్ల పోశెట్టి మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట సచ్చితానంద శాస్త్రి మృతి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. శాస్త్రి కథగానం జన రంజకంగా సాగేదానికి గుర్తు చేశారు, రాజన్న ఆలయంలో 70 ఏళ్లుగా జరుగుతున్న సద్గురు త్యాగరాజా స్వామి వారి ఆరాధన మహోత్సవాలు ఏట ఆయన హరికథ ఉంటుందని గుర్తు చేశారు. హరి కథకుడిగ తొలిసారిగా పద్మశ్రీ అవార్డును అందుకున్న గొప్ప కళాకారుడు శాస్త్రి అని కొనియాడారు. ఈనెల 27వ తేదీన హరిహర కళాభవన్ సికింద్రాబాద్ నందు జరుగు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం  సన్మానగోడ పత్రికలను ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కో కన్వీనర్లకు 13 మండల అధ్యక్షులకు అందజేయడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమైక్య గౌరవ అధ్యక్షులు బొడ్డు రాములు, వేములవాడ నృత్య కళానికేతన్ కార్యవర్గ సభ్యులు మామిళ్ళ సత్తయ్య ,మిద్ద  వినీత్, గాయకులు  రవి గౌడ్, మారుపాక  శంకర్, బుర్రి శంకరయ్య ,చిలుముల రమేష్ చారి, గుమ్మడి రాజెశం గౌడ్,  దొంగరి లక్ష్మీరాజ్యం, బిల్ల వెంకట్ నరసయ్య , అన్నారపు హరీష్, వెంకన్న తోపాటు తదితరులు  పాల్గొన్నా

Spread the love