అర్విందర్‌ కౌర్‌ హైకు

చలిగాలి –
మానుతున్న గాయపుమచ్చ
సన్నటి నొప్పి

ఆమె ఊరగాయ
నిండుకుంది –
నూనె మరకలు

నన్ను ఆశీర్వదించేప్పుడు
అమ్మ చేయి వణుకు –
గాలిలో ఆకు

దారి లేదు –
నేను చేరుకున్నానని
గూగుల్‌ చెపుతోంది.

ఆమె పాదముద్రలపై
వెన్నెల తాకింది –
ఆమె వెళ్ళిన తర్వాత

అమ్మ అంత్యక్రియలు –
గాలి నా జుట్టును
మెల్లగా లాలిస్తోంది.

ఆ రోజు
నేను ఎవరి కూతురినీ కాదు –
తలుపు గంట మౌనం.

సముద్రంలోకి
చంద్రుడి సద్దులేని సవారీ –
నదీ జలాలు .

సముద్ర తీర అస్తమయం –
అలలు నా పేరుని
తిరిగి కడలిలోకి తీసుకెళ్ళాయి.

స్వర్గపు నది
ఎప్పటికంటే ప్రకాశిస్తోంది –
అమ్మ వెళుతోంది.

బామ్మ ఒడి –
ఆమె నాటిన చెట్డు నీడ
ఎంత చల్లగా వుంది..

అమ్మ వెడలిపోయింది.
ప్రజ్వలించే నక్షత్రాన్ని చుడుతూ
చేతులు చాచాను

ప్రాంగణంలో పుప్పొడి –
అమ్మ లేకుండానే
వేసవి వస్తూ పోతూ

ఇల్లు అమ్మకం –
చివరిసారిగా వెళ్ళా
అమ్మ వంటగదిలోకి

చిన్నానాటి ఇంటిని
కూల్చేసారు –
రాళ్ళకుప్పలో మిణుగురులు

ఇటుక ఇటుకగా
ఆమె కలలు –
శిథిలాలలో

ఆస్తుల పంపకం –
తిరిగి తెచ్చుకున్నాను
అమ్మ నిమ్మచెట్డుని

తలిదండ్రుల ఇల్లు –
చెత్తకుప్పలో వికసిస్తూ
ఖీశీతీస్త్రవ్‌- ఎవ- అశృ పూలు

జీవితం ఎలా
పునరావతం అవుతుందో..
శిశిరంలో ఆకులు

మంచు బిందువులు –
కొత్త సంవత్సరం రోజున
అమ్మ ఆశీర్వచనాలు

మహోగ్ర సముద్రం ముందు
ఏమిటి మనం ..
ఇసుక రేణువులం.

అనువాదం: పి.శ్రీనివాస్‌ గౌడ్‌
9949429449

Spread the love