నవతెలంగాణ- భువనగిరి రూరల్
పరిపాలన తెలియని అసమర్ధ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి అని, త్రిబుల్ ఆర్ గురించి నాకు తెలియదు అనడం అసమర్ధ పాలనకు నిదర్శనం అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనాజీపురం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డప్పు, చప్పులతో పూల వర్షం కురిపిస్తూ, ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా ప్రజలు నానాయాతన పడుతున్నారనీ సిపిఐ బలపర్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా లేరని దళితులు నిరుద్యోగులు ప్రజలను అందరిని మోసం చేసాడని రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించాలని సూచించారు.ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అసమర్ధుడని ఈ సారి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలతో తెలంగాణ ప్రజలు ఆనందంగా ఉండవొచ్చని ఆ ఆరు పథకాల గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పిసిసి కమిటీ సభ్యులు తంగేళ్లపల్లి రవికుమార్, మండల అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా నాయకులు జంగయ్య యాదవ్, అనాజిపురం ఉపసర్పంచ్ మైలారం వెంకటేష్, ఎడ్ల శ్రీనివాస్, నానం కృష్ణ గౌడ్, సిపిఐ నాయకులు ఏశాల అశోక్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలకు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.