ఆర్టీసీ బస్సు ఢీకొని ఆశా కార్యకర్త మృతి

నవతెలంగాణ – ఖమ్మం: రఘునాథపాలెం మండలం కె.వి బంజర వద్ద రోడ్డు ప్రమాదంలో ఏన్కూర్ నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు, బైక్ పై ప్రయాణిస్తున్న దంపతులను ఢీకొట్టింది. వెనుక కూర్చున్న మాలోతు విజయ బస్సు వెనుక చక్రాల కిందపడింది. ఈక్రమంలో తలపై నుండి బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె భర్తకు గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతురాలు కె.వి బంజరలో ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నారు.ఆశ కార్యకర్తకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

Spread the love