ఆశ హాస్పిటల్ వైద్యులు శేఖర్ రెడ్డికి సన్మానం

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ కేంద్రంలో గల ఆశా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శేఖర్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని పట్టణానికి చేరుకున్న నేపథ్యంలో సేవ్ లైఫ్ ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ శేఖర్ రెడ్డిని సోమవారం సన్మానించడం జరిగింది. ఆశ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తూ హైదరాబాద్ తరహా కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలను తక్కువ ధరలకే అందిస్తూ సేవ్ లైఫ్ ఫౌండేషన్ వారు నిర్వహించే అన్నదాన కార్యక్రమాలలో సైతం ఆర్థికంగా సహాయపడి సేవా ,మానవతా దృక్పథంతో వారు చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని ఫౌండేషన్ సభ్యులు తెలియజేయడం జరిగింది. డాక్టర్ శేఖర్ రెడ్డి కి ఫౌండేషన్ సభ్యులు శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ సేవ్ లైఫ్ ఫౌండేషన్ వారి సేవా కార్యక్రమాలలో తన వంతు గా పేదవారికోసం ఉచితంగా మెడికల్ క్యాంపు తమ హాస్పిటల్ తరఫున నిర్వహిస్తామని మరియు సేవ్ లైఫ్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి సేవలు మునుముందు ఇంకా విస్తరించాలని కోరడం జరిగింది. తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలియజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో సేవ్ లైఫ్ ఫౌండేషన్ సభ్యులు ప్రభాస్,ప్రగత్,తేజ తదితరులు పాల్గొన్నారు.

Spread the love