ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం  రూ.18000/- లు ఇవ్వాలి.

– తిమ్మాపూర్, రామక్కపేట పీహెచ్సిల ఎదుట  ఆశా వర్కర్ల ధర్నా
– సీఐటీయూ ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్లు వినతి పత్రం
నవతెలంగాణ- దుబ్బాక రూరల్ 
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చెయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్, రామక్కపెట పీహెచ్సిల ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం మెడికల్ ఆఫీసర్లకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీఐటీయూ దుబ్బాక టౌన్ కన్వీనర్ కొంపెల్లి భాస్కర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆశా వర్కర్లు ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారని కానీ ఆశ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనం రూ. 18000 వేల  అమలు చేయాలని డిమాండ్ చేశారు.32 రకాల రిజిస్టర్లను ప్రభుత్వమే సప్లై చేయాలని డిమాండ్ చేశారు. టీబీ,లెప్రసి,కంటి వెలుగు సంబంధించిన తదితర పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని లెప్రసీ సర్వేలో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించి వాలంటీర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆశా వర్కర్లకు సంబంధం లేని అధనపు పనులను రద్దు చేయాలని 2021 సంవత్సరంలో ఆరు నెలలు పెండింగ్లో ఉన్న పిఆర్సి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మంజుల, భాగ్యలక్ష్మి, భారతి, శ్యామల, శోభ, చంద్రకళ, సంతోష, అనిత, లత, వసుంధర, తదితరులు పాల్గొన్నారు.
Spread the love