– మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
నవతెలంగాణ-పరిగి
ఆశ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం పరిగి పట్టణ కేంద్రంలో ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మెకు ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం పండగల సాయన్న, కష్ణ స్వామి ముదిరాజ్ విగ్రహ ఆవి ష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీ జయంతి సం దర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో శ్రమ దానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు సేవలు అందిం చడానికి, హాస్పిటల్‌కు, పేదలకు వారధిగా ఉండేందుకు ఆశా వర్కర్లను నియమించారని అన్నారు. ఏఎన్‌ఎంలకు సమానంగా ఆశా వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారని తెలి పారు. వారు చేయని సేవలు లేవని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వారి జీతభత్యాలు పెంచాలని, హెల్త్ కార్డులు, పిఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత, 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని గత ఏడు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం దుర్మార్గమన్నారు. తెలంగాణలో ఏ సమ్మె నోటీసు ఇచ్చి నిరసన వ్యక్తం చేసిన వారిని బెదిరింపులకు గురి చేస్తూ, ఉద్యోగాల నుండి తొలగిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఆశా వర్కర్లను చర్చలకు పిలిచి వారి సమస్యలు పరి ష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకు లు కిరణ్ బూనేటి, మిట్ట పరమేశ్వర్ రెడ్డి, బీజేపీ నాయ కులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.