గోల్కొండ కోటలో నేడు ఆషాఢ బోనాలు ప్రారంభం

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు గురువారం ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి మొదటి బోనం సమర్పణతో రాష్ట్రంలో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ 9 వారాలపాటు జరిగే బోనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గోల్కొండ కోట బోనాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతిని తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ఇక్కడ జరిగే బోనాలకు రెండు తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని బోనాలను సమర్పిస్తారు.

Spread the love