బిక్షాటన చేస్తూ ఆశాల నిరవధిక సమ్మె కొనసాగింపు

– కరోనా ఫ్రంట్ వారియర్స్ పై చిన్న చూపు 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
సీఐటీయూ పిలుపు మేరకు స్థానిక ఆశా వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో 10వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం ఆళ్ళపల్లి మండల కేంద్రంలో బిక్షాటన కార్యక్రమం చేపట్టడం జరిగిందని స్థానిక ఆ సంఘం మండల అధ్యక్షురాలు సడియం సుగుణ తెలిపారు. ఈ సందర్భంగా సుగుణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కరోనా విలయతాండవం చేస్తున్న రోజుల్లో సైతం మా ప్రాణాలను తెగించి ఫ్రంట్ వారియర్స్ గా విధులు నిర్వర్తించామని, అలాంటి ఆశా వర్కర్లు ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని, శ్రమకు తగిన వేతనాలు ప్రభుత్వం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత పది రోజులుగా మా ఆశా సంఘం రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడుతున్న ప్రభుత్వం స్పందించక పోగా మండలంలో అనేక మంది ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో వైద్యం అందక నానా అవస్థలు పడుతున్నా సీఎం కేసీఆర్ చలించకపోవడం దారుణమన్నారు. మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను విరమించేది లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఆశా వర్కర్లు చంద్రకళ, సుశీల, సమ్మక్క, సీతాదేవి, కావేరి, సావిత్రి, బి.సావిత్రి, విజయ లక్ష్మి, సుక్కమ్మ, సునీత, రమణ, దేవకుమారి, లక్ష్మీకాంత, ఈశ్వరి, సుందరమ్మ, అనసూర్య, బుచ్చమ్మ, రాంబాయి, రాజకుమారి, రేవతి, తిరుపతమ్మ, సత్యవతి, పద్మ, కృష్ణ కుమారి, బాలమ్మ, బాయమ్మ, వెంకటమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love