– వోక్స్, వుడ్‌కు చోటు
– బెంచ్‌కే పరిమితం కానున్న అండర్సన్, టంగ్
లీడ్స్: యాషెస్ సిరీస్‌లో మూడో టెస్టు ఆడే జట్టును ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్‌బోర్డు(ఇసిబి) బుధవారం ప్రకటించింది. ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ అండర్సన్‌తోపాటు టంగ్‌ను బెంచ్‌కే పరిమితం చేసి వీరి స్థానంలో వోక్స్, వుడ్‌లకు చోటు కల్పించింది. ఐదు టెస్ట్‌ల యాషెస్ సిరీస్‌లో 0-2తో వెనుకబడ్డ ఇంగ్లండ్ జట్టు మూడో టెస్టు ఆడే జట్టులో మార్క్ వుడ్, క్రిస్ వోక్స్‌ను తీసుకుంది. వీరిద్దరి కోసం జేమ్స్ ఆండర్సన్, జోష్ టంగ్‌ను పక్కన పెట్టింది. టంగ్ చివరి టెస్టులో బాగానే రాణించిన సంగతి తెలిసిందే.
మూడు కీలక వికెట్లు తీసుకున్న అతను సత్తా చాటాడు. కానీ క్రిస్ వోక్స్ కనుక జట్టులో చేరితే బ్యాటింగ్‌లో కూడా కొంత బలం పెరిగే అవకాశం ఉంది. అందుకే ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే తొలి టెస్టు ఆడిన తర్వాత చేతి వేళ్ల గాయంతో రెండో టెస్టులో ఆడని మొయిన్ అలీ కూడా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో ఇంగ్లండ్ స్పిన్ బౌలింగ్ విభాగం మరింత బలోపేతం ఖాయం. మరోవైపు ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్‌కు ఇది వందో టెస్టు కూడా కావడం గమనార్హం. తన కెరీర్‌లో కీలకమైన ఈ మ్యాచ్‌ను విజయంతో ముగించాలని స్మిత్ భావిస్తున్నాడు. రెండో టెస్టులో గాయపడిన స్పిన్నర్ నాథన్ లియాన్ దూరం కావడంతో అతని స్థానంలో యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ స్పిన్ బాధ్యతలు మోసేందుకు సిద్ధమయ్యాడు.
ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), మొయీన్ అలీ, క్రిస్ వోక్స్, ఓలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, మార్క్ వుడ్.