నవతెలంగాణ-గోవిందరావుపేట
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్నింట అంచలంచరుగా ఎదిగి ఉన్నత స్థాయిలో ఉండాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సోమవారం మండలంలోని చల్వాయి గ్రామంలో అశోక్ నూతన గృహప్రవేశానికి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కష్టపడి పనిచేసే తత్వం తల్లిదండ్రుల ద్వారా పునికి పుచ్చుకున్న అశోక్ ప్రతి విషయంలోనూ పట్టుదలగా వ్యవహరిస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త మొదలుకొని జిల్లా అధ్యక్ష స్థానం వరకు ఎదిగిన అశోక్ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. రాజకీయంగా అశోక్ ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీతక్క తో పాటు పలువురు రాజకీయ నాయకులు ఇతర మండలాల అధ్యక్షులు కార్యదర్శులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.