మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన అశోక్..

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పలు మృతుల కుటుంబాలను శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.  మండల కేంద్రంలోని కాగితాల సుదర్శన్, పత్తిరి రాజు, లక్కాకుల సతీష్ , యలమర్తి బాబు  మరియు గురుకు స్వరూప  అనారోగ్యంతో మరణించగా మృతుల కుటుంబాలను ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. అలాగే వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్, మత్స్యశాఖ జిల్లా అధ్యక్షులు కంబాల రవి, ములుగు మండల అధ్యక్షులు ఎండి.చాంద్ పాషా, బీసీ సెల్ ములుగు మండల అధ్యక్షులు పౌడాల ఓం ప్రకాష్, మండల ఇంఛార్జి కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, సహకార సంఘ పాలకవర్గ సభ్యులు జెట్టి సోమయ్య, మండల ఉపాధ్యక్షులు తేళ్ల హరిప్రసాద్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, గ్రామ అధ్యక్షులు రామచంద్రపు వెంకటేశ్వర్ రావు, జంపాల చంద్రశేఖర్, ఎస్.సి.సెల్ మండల అధ్యక్షులు పడిదల సాంబయ్య, గుండెబోయిన రమేష్, గుండె శరత్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Spread the love