నవతెలంగాణ – అశ్వారావుపేట : కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు అయిన తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చి మహిళా ప్రయాణీకులకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించే మహాలక్ష్మి పథకాన్ని శనివారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని బస్ స్టాండ్ లో లాంచనంగా ప్రారంభించారు. ఎస్.ఎం గార్లపాటి రంగారావు,కంట్రోలర్ నార్లపాటి సునీత లు బస్ ను ముస్తాబు చేసి మహిళా ప్రయాణీకులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎస్.హెచ్.ఒ ఎస్.ఐ శ్రీకాంత్,పి.సి మూడ్ రామారావు,మహిళా కానిస్టేబుల్ క్రిష్ణ వేణి లు పాల్గొన్నారు.