రిటైర్ మెంట్ ప్రకటించిన అశ్విన్..

Ashwin announced his retirement. నవతెలంగాణ – హైదరాబాద్: దేశం గర్వించదగ్గ ప్రముఖ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో అశ్విన్ ఈ ప్రకటన చేశారు. అంతకు ముందు డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీతో అశ్విన్ భావోద్వేగానికి గురైన వీడియో వైరల్ అవుతోంది. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించినట్టు బీసీసీఐ కూడా ఎక్స్ వేదికగా వెల్లడించింది. అంతర్జాతీయ క్రికెట్ లో ఆల్ రౌండర్ గా అద్భుత ప్రదర్శన కనబరిచారని బీసీసీఐ ప్రశంసించింది. 38 ఏళ్ల అశ్విన్ 2011లో వెస్టిండీస్ పై తొలి టెస్ట్ ఆడారు. 2010లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ తో వన్డే కెరీర్ ను ప్రారంభించారు. 105 టెస్టులు ఆడిన అశ్విన్ 3,474 పరుగులు చేశారు. 536 వికెట్లు తీశారు. టెస్టుల్లో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు సాధించారు. టెస్ట్ ఫార్మాట్ లో 37 సార్లు 5 వికెట్లు పడగొట్టిన ఘనత అశ్విన్ ది. ఒక టెస్ట్ లో 10 వికెట్లు తీసిన ఘనతను 8 సార్లు సాధించారు. 116 వన్డేల్లో 707 పరుగులు చేశారు. 156 వికెట్లు పడగొట్టారు. 65 టీ20ల్లో 72 వికెట్లను పడగొట్టారు. పొట్టి ఫార్మాట్ లో 154 పరుగులు చేశారు.

Spread the love