బీజేపీ అభ్యర్థి మాధవీలతను హగ్ చేసుకున్న ఏఎస్ఐ.. సస్పెండ్..!

నవతెలంగాణ – హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల వేళ అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. అయితే అభ్యర్థుల ప్రవర్తన, ప్రసంగాలు వివాదాస్పదం కావడంతో వారిపై కేసులు అవుతున్నాయి. తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఘటనలో సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవిపై వేటు పడింది. ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రచారంలో ఉన్న బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతను ఉమాదేవి ఆలింగనం చేసుకున్నారు. అయితే మాధవీలతను ఉమాదేవి హగ్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యంగా అధికారులు ఆచితూచి వ్యవహరించకపోతే వేటు తప్పదు. సాధారణ సమయంలో రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఎలా ఉన్నా.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు హద్దులు మీరకూడదు. తాజాగా ఎన్నికల ప్రచారంలో ఉన్న మాధవీలతను ఉమాదేవి అలింగనం చేసుకున్న వీడియో వైరల్ కావడంతో కోడ్ ఉల్లంఘించారని.. సీపీ శ్రీనివాస్ రెడ్డి ఉమాదేవిని సస్పెండ్ చేశారు.

Spread the love