నవతెలంగాణ – హైదరాబాద్: వచ్చే ఏడాది పురుషుల ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో ఇండియాలో జరగనుంది. ఈ విషయాన్ని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ స్పాన్సర్‌షిప్ రైట్స్ కోసం రిలీజ్ చేసిన ఇన్విటేషన్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అలాగే 2027 ఎడిషన్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ రెండు టోర్నీల్లో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. 2026 మహిళల ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగనుండగా, వేదికపై స్పష్టత రావాల్సి ఉంది.