ఎఐఎన్‌యులో ఏషియన్‌ హెల్త్‌కేర్‌కు మెజారిటీ వాటా

హైదరాబాద్‌ : సింగిల్‌ స్పెషాలిటీ ఆస్పత్రి అయిన ఏషియన్‌ ఇన్స్‌ట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ (ఎఐఎన్‌యు)లో మెజారిటీ వాటాలను స్పెషాలిటీ హెల్త్‌కేర్‌ డెలివరీ ప్లాట్‌ఫాం అయిన ఏషియా హెల్త్‌కేర్‌ హోల్డింగ్స్‌ (ఎహెచ్‌హెచ్‌) దక్కించుకుంది. ఎఐఎన్‌యుకు దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఆస్పత్రులు ఉండటంతో పాటు రోబోటిక్‌ యూరాలజీ సర్జరీలలో ముందంజలో ఉంది. ప్రైమరీ, సెకండరీ ఇన్‌ప్యూజన్ల ద్వారా ఎహెచ్‌హెచ్‌ ఈ సంస్థలో రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు పేర్కొంది. ఈ పెట్టుబడి ద్వారా ఎహెచ్‌హెచ్‌ ఇప్పుడు యూరాలజీ, నెఫ్రాలజీ విభాగంలోకి అడుగుపెట్టడంతో నాలుగో స్పెషాలిటీలోకి కూడా వచ్చినట్లయిందని ఏషియా హెల్త్‌కేర్‌ హోల్డింగ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ విశాల్‌ బాలి తెలిపారు.

Spread the love