నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏఎస్ఐ కుమారుడు మృతి చెందాడు. షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మున్సిపాటిటి పరిధిలోని తిమ్మాపూర్ 44వ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. మృతి చెంది వ్యక్తి షాద్ నగర్ నియోజవర్గం నందిగామ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గోపాల్ కుమారునిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.