బొలీవియా మాజీ అధ్యక్షుడు మొరేల్స్‌పై హత్యాయత్నం

Assassination attempt on former Bolivian President Moralesలాపాజ్‌ : తనపై హత్యాయత్నం జరిగిందని బొలీవియా మాజీ అధ్యక్షుడు ఎవో మొరేల్స్‌ వెల్లడిం చారు. తన కారుపై గుర్తు తెలియని వ్యక్తులు ఆది వారం కాల్పులు జరిపారని తెలిపారు. ఈ దాడిలో ఆయన గాయపడలేదు. ఈ పరిస్థితికి అధ్యక్షుడు లూయిస్‌ అరెస్‌ ప్రభుత్వమే కారణమని మొరేల్స్‌ విమర్శించారు. రాజకీ యాల నుండి తనను పక్కకు తప్పించాలన్నది ప్రభుత్వ కుట్రగా వుందని, అందుకే వారు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శిం చారు. మాజీ అధ్యక్షుడిపై హత్యా యత్నాలకు వెనుకాడబోని ఫాసిస్ట్‌ ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం మనమున్నామనడానికి స్పష్టమైన ఆధా రాలున్నాయని మొరేల్స్‌కి చెందిన ఎంఎఎస్‌ చీలిక గ్రూపు ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. నల్ల దుస్తులు ధరించి, భారీగా ఆయుధాలు కలిగిన వ్యక్తులు రెరండు వాహనాల్లో వచ్చి మొరేల్స్‌ కాన్వారుపై పొంచి వుండి దాడి జరి పారని ఆ ప్రకటన పేర్కొంది. మొరేల్స్‌ తలకు కొద్ది సెంటిమీటర్ల దూరం నుండి బుల్లెట్లు వెళ్లాయని, తృటిలో ప్రాణాపాయం తప్పిందని తెలిపింది. ఇందుకు సంబంధించి వీడియో విడుదల చేసింది. ఈ సంఘటన జరిగినప్పుడు గగనతలంలో హెలి కాప్టర్లు రొద కూడా వీడియోలో వినిపిస్తోంది. ఈ దాడిని అధ్యక్షుడు అరెస్‌ ఖండించారు. తక్షణమే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. వ్యక్తు ను చంపడం వల్ల సమస్యలు పరిష్కారం కావని ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. పాలక పార్టీ మూవ్‌మెంట్‌ టూవర్డ్స్‌ సోషలిజం (ఎంఎఎస్‌) ఉన్నత స్థాయి వర్గాల్లో విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వచ్చే ఏడాది జరిగే ఎన్ని కల్లో పార్టీకి ఎవరు నేతృత్వం వహించాలనే విషయంలో మొరేల్స్‌, అరెస్‌ల మధ్య ఘర్షణ జరుగు తోంది. మొరేల్స్‌ ప్రభుత్వ హయాంలో అరెస్‌ ఆర్థిక మంత్రిగా చేశారు.

Spread the love