ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసన సభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలకు కీలక రిక్వెస్ట్ చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నామని..ఎమ్మెల్యేలంతా ప్రాజెక్టు సందర్శనకు రావాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఖజనా డబ్బు వృథా అయిందన్నారు. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా, అడ్డగోలుగా ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన అనేక ప్రాజెక్టులు ఇప్పటికీ దృఢంగా ఉన్నాయన్నారు. మేడిగడ్డలో అసలేం జరిగిందో ప్రజలకు నిజాలు తెలియాలన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్టు వచ్చిందని.. డ్యామ్ డిజైన్‌లో అనేక తప్పులు ఉన్నాయన్నారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల ప్రజా ధనం వృథా అయిందన్నారు. దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Spread the love