నేడు శాసనసభ ఎన్నికల పోలింగ్‌

– సర్వం సిద్ధం చేసిన అధికారులు
– ఐదు నియోజకవర్గాల్లో 966439 మంది
– ఓటు హక్కును వినియోగించుకోనున్న ప్రజలు
– పోటీలో ఉన్న 95 మంది అభ్యర్థులు
– ప్రభావిత ప్రాంతంలో 7 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్‌
నవతెలంగాణ-పాల్వంచ
గురువారం 30వ తేదీన జరగనున్న శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో 966439 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగానికి 1098 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతంలో పోలింగ్‌ ప్రక్రియ ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనుంది. ఓటర్లు సమయం ముగిసే వరకు వేచి ఉండకుండా సకాలంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక అలా విజ్ఞప్తి చేశారు. ఐదు నియవర్గాల పరిధిలో 95 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు చెప్పారు. పోలింగ్‌ విధులు నిర్వహించి సిబ్బంది బుధవారం మెటీరియల్తో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకొని ఏర్పాటు చేశారని తెలిపారు. ఉదయం 5:30 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ముందస్తుగా మాకు పోలింగ్‌ నిర్వహిస్తారని చెప్పారు. ఏజెంట్లు సమక్షంలో మాకు పోలింగ్‌ నిర్వహించిన తదుపరి ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభం అవుతుందని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో సీసీటీవీలో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ ప్రక్రియను పర్యవేక్షణ చేయనున్నట్లు చెప్పారు. 750 వీల్‌ చైర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వృద్ధులు, బాలింతలు, వికలాంగులను పోలింగ్‌ కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక ఆటోలు ఏర్పాటుతో పాటు సహాయకులను నియమించినట్లు తెలిపారు. రిజర్వులో ఈవీయంలో యంత్రాలు అందుబాటులో ఉంచామని ఎక్కడైనా సమస్య వస్తే తక్షణమే సెక్టార్‌ అధికారులు ఈవీఎంత్రాలు అందజేస్తారని తెలిపారు. ఏబీఎన్‌ యంత్రాలు పర్యవేక్షణకు ఈసీఐఎల్‌ నుండి 15 మంది ఇంజనీర్లు ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియ నిర్వహణలో 1313 మంది పీఓలు 1313 మంది ఏపీవోలు 2626 మంది ఓపీఓలు 306 మంది మైక్రో అబ్జర్వర్స్‌ పాల్గొంటున్నట్లు చెప్పారు. 2398 బ్యాలెట్‌ యూనిట్లు 1544 కంట్రోల్‌ యూనిట్లు 1540 వీ ప్యాట్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఓటర్లు ఓటు హక్కు వినియోగానికి ఓటర్లు స్లిప్పులతో పాటు ఎన్నికల సంఘం సూచించిన 15 గుర్తింపు కార్డులో ఏదేని 1 వెంట తెచ్చుకోవాలని తెలిపారు. ఓటు హక్కు వినియోగం రహస్యమని బహిర్గతం చేయరాదని తెలిపారు. పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ ఫోన్లు, మంచినీళ్లు, బాటిళ్లు, మారనాయుధాలు తీసుకెళ్లడం నిషేధమని తెలిపారు. సెల్ఫీలు తీయడం ఫోటోలు తీయడం నేరమని చెప్పారు. లక్ష్మిదేవిపల్లి రామచంద్ర డిగ్రీ కళాశాల ఈవీఎంల డిస్ట్రీబ్యూషన్‌ సెంటర్‌ నుండి ఎన్నికల విధులకు హాజరవుతున్న పోలీస్‌ అధికారులకు, సిబ్బందికి ఎస్పీ డా.వినీత్‌.జి సూచనలు చేశారు. ఎక్కడ కూడా సమస్య రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని శాంతిభద్రతలను కాపాడాలని పోలీసులకు ఆదేశించారు. సమస్య ఆత్మక ప్రాంతంలో ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ పోలింగ్‌ ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం రామచంద్ర కాలేజీలో పోలింగ్‌ మెటీరియల్ను సిబ్బందికి అందజేసి పోలీస్‌ స్టేషన్లకు వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ ప్రియాంక అలా కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్‌ కాస్టింగ్‌ నుండి పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Spread the love