ఓ క్రైమ్‌ను పోలీసులు పరిష్కరించా లంటే క్లూస్ టీం ప్రాముఖ్యత ఎంత ఉంటుంది అనేది సాధారణ ప్రజలకు తెలియదు. ఓ క్రిమినల్‌ను పట్టుకు నేందుకు క్లూస్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లు పడే కష్టాన్ని చూపించే చిత్రమే ‘అథర్వ’. సస్పెన్స్, క్రైమ్ జోనర్లో అన్ని రకాల ఎమోషన్స్‌తో తెరకెక్కిం చిన చిత్రమిది. నూతలపాటి నర సింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరో,హీరోయిన్లుగా నటించారు.
మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా, సుభాష్ నూతలపాటి నిర్మించారు. విజయ, ఝాన్సీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీని తాజాగా పోలీస్ డిపార్ట్మెంట్లోని క్లూస్, ఫోరెన్సిక్ విభాగం వారు వీక్షించారు. తెలంగాణ స్టేట్ ఫొరెన్సిక్ సైన్స్ లేబరేటరి అడిషనల్ డైరెక్టర్ డా.అనిత ఎవాంజెలిన్ మాట్లాడుతూ, ‘మా వాళ్లని హీరోల్లా చూపించారు. ఈ సినిమా మా అందరికీ ఓ నివాళిలా అనిపించింది. మా కష్టాన్ని అందరికీ తెలిసేలా తీసిన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్, క్లూస్ జాయింట్ డైరెక్టర్ డా.వెంకన్న మాట్లాడుతూ, ‘దర్శకుడు మహేష్ ఈ కథను నాకు ముందు నెరేట్ చేశాడు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. చివరి వరకు ఉత్కంఠభరితంగా తీశారు. క్రైమ్ సీన్ ఆఫీసర్ అంటే కార్తీక్ రాజులా ఉండాలనేలా చూపించారు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది’ అని అన్నారు.