ఆతిశీ జింకలా పరిగెడుతున్నారు.. మళ్లీ నోరు జారిన బీజేపీ నేత

నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ సీఎం ఆతిశీ తన తండ్రినే మార్చేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేశ్ బిధూరీ మరోసారి నోరు జారారు. ఆమె ఓట్ల కోసం ఢిల్లీ రోడ్లపై జింకలా పరిగెడుతున్నారని కామెంట్ చేశారు. నాలుగేళ్లలో ఆమె ఎప్పుడూ నగర సమస్యలను పట్టించుకోలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గ రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా మారుస్తానని రమేశ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే.

Spread the love