జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గుండ సురేష్(35) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. శనివారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ యాత్రలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణక్క పాల్గొన్నారు. అంతక ముందు సురేష్ పార్థీవ దేహానికి నివాళులర్పించి,వారి కుటుంభ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.సురేష్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.పేద కుటుంబంలో జన్మించిన సురేష్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేశారని, గ్రామంలో అందరినీ పలకరిస్తూ కలుపుగోలుగా ఉండేవాడని,ఆయన మృతి బాధాకరమని సుగుణక్క అన్నారు.ఈ కార్యక్రమంలో కనక వెంకటస్వామి,గుగ్లావత్ రవి,రాందాస్, గోల్కొండ రాజన్న,గుండ నర్సయ్య,కోవ శాంతయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.