దారుణం.. అక్కా చెల్లెళ్లపై గ్యాంగ్ రేప్

నవతెలంగాణ – చత్తీస్ గఢ్: రాయ్ పూర్ లో దారుణం అక్కాచెల్లెళ్లపై కొంతమంది దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. ఓ యువతికి ఇటీవల పెండ్లి నిశ్చయమైంది. ఆమె తన చెల్లి, కాబోయే భర్తతో కలిసి రాఖీ వేడుకల కోసం గురువారం మహాసముంద్ జిల్లాకు వెళ్లింది. బైక్ పై వెళ్లిన ముగ్గురూ రాత్రి తిరిగి వస్తుండగా, రాయ్ పూర్ దగ్గర కొంతమంది అడ్డుకున్నారు. మొదట ముగ్గురు వచ్చి వాళ్ల దగ్గరున్న డబ్బులు, ఫోన్లు దోచుకుని వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న మరో ఏడుగురు అక్కడికి వచ్చారు. యువతికి కాబోయే భర్తను తీవ్రంగా కొట్టి, అక్కాచెల్లెళ్లను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఎలానే అలా వారి భారీ నుంచి తప్పించుకుని  బాధితులు పోలీస్ స్టేషన్ కు చేరుకుని కంప్లయింట్ ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి, పది మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో లోకల్ బీజేపీ లీడర్ లక్ష్మీనారాయణ సింగ్ కొడుకు పూనమ్ ఠాకూర్ ఉన్నారని పోలీసులు చెప్పారు. అతడు ఇటీవలే జైలు నుంచి బెయిల్ పై బయటకొచ్చాడని పేర్కొన్నారు.

Spread the love