హైదరాబాద్ హయత్‌నగర్‌లో దారుణం

kidnapped-girl
kidnapped-girl

నవతెలంగాణ – హైదరాబాద్
హైదరాబాద్ హయత్‌నగర్‌లో దారుణం జరిగింది. బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు ఔటర్ రింగురోడ్డు సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశారు. వారితో జరిగిన పెనుగులాటలో గాయపడిన బాలిక తప్పించుకుని రోడ్డుపైకి వచ్చి ఏడుస్తూ సాయం కోసం ఎదురుచూసింది. అటుగా వెళ్తున్న ఓ హిజ్రా బాలికను చూసి దుండగుల బారి నుంచి రక్షించి పోలీసులకు అప్పగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధిత బాలికను ఆసుపత్రికి తరలించారు.

Spread the love