ఖమ్మంలో దారుణం..కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ-ఖమ్మం : వీధి కుక్కల దాడిలో ఓ బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. మూడేళ్ల బాలుడు ముత్యాల సాయి శనివారం రోజు ఉదయం స్కూల్ కి వెళ్తుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘ‌ట‌న లక్ష్మీదేవి పల్లి మండలంలోని శ్రీనగర్ గ్రామపంచాయతీలో గల ఇందిరానగర్ చోటుచేసుకుంది. కుక్క‌ల దాడిలో బాలుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. బాలుడి అరుపులు విని తండ్రి రాంబాబు అక్క‌డున్న వారు కుక్క‌ల‌ను త‌రిమేయ‌డంతో ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డ్డాడు. అయితే, బాలుడి మోచేతికి,కాలికి తీవ్ర‌ గాయాల అవ్వడంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో అన్ని పంచాయతీలలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని అధికారులు ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మండల ప్రజలు కోరుకుంటున్నారు.

Spread the love