రంగారెడ్డి జిల్లాలో దారుణం..

నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో పరువు కోసం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది ఒక రాక్షస కుటుంబం. పూర్తి వివరాల మేరకు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్దవెళ్లి గ్రామంలో కరణ్ అనే యువకుడు వరుసకు చెల్లి అవుతుందని తెలిసినా ప్రేమలో పడి మునిగిపోవడంతో అవేమీ పట్టించుకోకుండా మనసులు కలిస్తే చాలు అని భావించి పెండ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన అమ్మాయి తండ్రి, బంధువులు తీవ్ర ఆగ్రహంతో కిరణ్ ను నిర్దాక్షిణ్యంగా చంపేసి పొలంలో పూడ్చి పెట్టారు. ఇక ఈ విషయం తెలుసుకున్న కరణ్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయాలు అన్నీ బయటకు వచ్చాయి. ప్రస్తుతం పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తును చేస్తున్నారు.

Spread the love