నవతెలంగాణ – లక్నో: బీహార్‌లోని కతిహార్ జిల్లాలో ఒ ఊరేగించిన ఘటన చోటుచేసుకుంది. ఆనంద్ అనే వ్యక్తి కబర్‌లోని ఓ పిండి మిల్లులో పనిచేస్తున్నాడు. దీంతో యజమాని రాజీవ్ కుమార్ ఇంటికి రెగ్యులర్‌గా వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాజీవ్ భార్యతో అతనికి పరిచయం ఏర్పడింది. ఇద్దరు గత కొంతకాలంగా ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. అయితే ఉన్నట్లుండి ఆనంద్ తనను వేధిస్తున్నాడని ఆమె తన భర్తకు చెప్పింది. గత మూడు నెలలుగా సతాయిస్తున్నాడని, సమయం సందర్భం లేకుండా ఫోన్ చేస్తున్నాడని, ఇంటికి వస్తున్నాంటూ తెలిపింది. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు ఆనంద్‌ను పట్టుకుని.. ఓ గుంజకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. అర గుండు గీయించారు. మెడలో పాత బూట్లతో చేసిన దండ వేసి ఊరేగించారు. కాగా, అమాయకుడిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఆ మహిళే ఆనంద్‌కు తరచూ ఫోన్ చేసేదని, ఇంటికి రావాలని పిలిపించుకునేదని చెప్పారు. అయితే ఆమెతో తనకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని బాధితుడు చెప్పాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆనంద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇరుపక్షాలు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో అనంతరం పోలీసులు అతడిని వదిలిపెట్టారు.