అట్రాసిటీ కేసు నమోదు

నవతెలంగాణ-వీణవంక
మండలంలోని  బేతిగల్ గ్రామంలో దళిత మహిళను కులం పేరుతో దూషించిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎండీ ఆసీఫ్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్సై కథనం ప్రకారం.. బేతిగల్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ మోరె సారయ్య కూర్చొని ఉన్నాడు. కాగా అదే గ్రామానికి చెందిన చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి సర్పంచ్ తో దుర్బాషలాడుతుండగా అక్కడే ఉన్నగ్రామ పంచాయతీలో సపాయిగా పనిచేస్తున్న దళిత మహిల ఎందుకు గొడవ అని ప్రశ్నించింది. దీంతో ఆమెను ఆంజనేయులు కులం పేరుతో దూషించాడు. కాగా ఆ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆసీఫ్ తెలిపారు.

Spread the love