అత్తాపూర్‌లో దారుణం…

నవతెలంగాణ – హైదరాబాద్: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి సులేమాన్ నగర్‌ లో దారుణం జరిగింది. ఖలీల్ (30) అనే వ్యక్తిని.. అతని స్నేహితులు కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. మద్యం సేవించి కత్తులతో దాడి చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ పరిస్థితిని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Spread the love