చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు: ఏటీఎస్ శ్రీనివాస్

నవతెలంగాణ – నవీపేట్

చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని, అందుకోసం పదవ తరగతిలో 10/10 గ్రేడ్ సాధించిన విద్యార్థినిలకు రూ. 12 వేల బంగారంను బహుమతిగా అందిస్తానని సర్పంచ్ ల ఫోరం జిల్లా అధ్యక్షులు ఏటిఎస్ శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తుందని కాబట్టి సద్వినియోగం చేసుకొని చదువుకుంటే మంచి బంగారు భవిష్యత్తును పొందవచ్చని అందుకోసమే పదో తరగతిలో ఎంతమంది విద్యార్థులు అయినా 10/10 గ్రేడ్ సాధిస్తే అందరికీ 12 వేల బంగారం బహుమతిని అందిస్తానని అందరూ కష్టపడి చదివి మంచి ఫలితాలను సాధించాలని కోరారు. విద్యా వ్యవస్థలో మార్పు రావాలని ప్రతి ఒక్కరిలో దేశభక్తి, జాతీయ భావం పెరగాలని బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శ్రీకాంత్ అన్నారు. ఇంతకుముందు విద్యార్థులు చేసిన దేశభక్తి సాంస్కృతిక నృత్యాలతో పాటు ఫ్లాగ్ మార్చ్ ఎంతగానో అలరించాయి. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థినిలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అనిత,ఎస్ఎంసి చైర్మన్ వీరేందర్, ఆనంద్, పుట్ట శ్రీనివాస్ గౌడ్, రామకృష్ణ, సాయి కిరణ్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love