చంద్రగిరి కూటమి అభ్యర్థిపై దాడి..

నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత కూడా వైకాపా దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై  వైకాపా శ్రేణులు దాడి చేశారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్‌ రూమ్‌ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా నానిపై దాడికి చేశారు. ఈ దాడిలో నాని భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ఆయన కారు ధ్వంసమైంది.

Spread the love