డెన్మార్క్‌ ప్రధానిపై అగంతకుడి దాడి…అరెస్టు

డెన్మార్క్‌ ప్రధానిపై అగంతకుడి దాడి...అరెస్టుకోపెన్‌హేగన్‌ : డెన్మార్క్‌ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సన్‌పై శుక్రవారం దాడి జరిగిందని ప్రధాని కార్యాలయం శనివారం ప్రకటించింది. సెంట్రల్‌ కోపెన్‌హేగన్‌లో ఒక వ్యక్తి ఆమెపై దాడికి దిగడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయని ఆ ప్రకటన తెలిపింది. దాడి జరిగిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళి పరీక్షలు చేయించామని, ప్రస్తుతం ప్రధాని సురక్షితంగానే వున్నారని, అయితే ఈ దాడి కారణంగా ఆమె షాక్‌లో వున్నారని పేర్కొంది. ఈ కారణంగా శనివారం నాటి ప్రధాని అధికారిక కార్యాలయాలన్నీ రద్దయ్యాయి. దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు. దర్యాప్తు సాగుతోందని తెలిపారు. అంతకుమించి వివరాలు ఇవ్వలేదు. ఇయు ఎన్నికల్లో డెన్మార్క్‌ ఓటింగ్‌కు రెండు రోజులు ముందుగా ఈ దాడి చోటు చేసుకుంది. మూడు వారాల క్రితం స్లొవేకియా ప్రధాని రాబర్ట్‌ ఫికో కూడా ఇలాగే హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడ్డారు.

Spread the love