నవతెలంగాణ డిచ్ పల్లి: ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని డిచ్ పల్లి మండలం లోని నక్కల గుట్ట, నడిమి తండా కు చెందిన పలువురు తండాలో వాసులు దాడి చేసినట్లు ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ భట్ తెలిపారు.అయన తెలిపిన వివరాల ప్రకారం గురువారం మంచిప్ప సెక్షన్ సిబంది నక్కల గుట్ట, నడిమి తండా లో అక్రమంగా అటవీ భూములను దున్నుతూ ఉన్నారనే సమాచారం తో ఫారెస్ట్ సెక్షన్ అధికారిని మానస, భిట్ అధికారులు సునిత, ప్రవీణ్, బేస్ క్యాంప్ వాచర్స్, రవి, సంతోష్, అరమిద్ లు అడ్డుకోవడానికి వెళ్లగా తండా కు చెందిన పలువురు అధికారులపై కారం, కర్రలతో దాడి చేసినట్లు రెంజ్ అధికారి రవి మోహన్ భట్ వివరించారు.దాడి చేసిన వారిపై తివ్ర చర్యలు తీసుకుంటామని,వారందరి పై పోలిసులకు ఫిర్యాదు చేయనున్నట్లు రెంజ్ అధికారి రవి మోహన్ భట్ తెలిపారు.ఈ దాడి హేయమైన చర్యగా అయన అభివర్ణించారు.