
– దుబ్బాక ఠాణాలో 9 మందిపై కేసు నమోదు
– మేజిస్ట్రేట్ ముందు హజర్పరిచి కరీంనగర్ సెంట్రల్ జైల్ కి తరలింపు
నవతెలంగాణ దుబ్బాక రూరల్
మంత్రాలు చేస్తున్నాడని అనుమానంతో వ్యక్తి పై 9మంది దాడి చేశారు.ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోనీ హబ్సిపుర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ మేరకు ఆదివారం దుబ్బాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ గంగరాజు వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని హబ్సిపూర్ గ్రామానికి చెందిన మిరుదొడ్డి నర్సింలు (45) అనే వ్యక్తి మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో అతడిపై అదే గ్రామానికి తొమ్మిది మంది వ్యక్తులు ఈ నెల 17న మాట్లాడుకుందాం రా అని పిలిచి నర్సగళ్ళ మహిపాల్, నరస గల్ల మైసయ్య , నర్సగళ్ళ ఎల్లం, నరస గల భూదయ్య, జోగు పోచయ్య , మళ్లీ బాబు,ఏర్పుల శ్యామ్ ,మళ్లీ స్వామి, ఎర్పుల పోచయ్య (9మంది) కట్టెలు,రాళ్ళతో దాడి చేసి హత్యాయత్నం చేశారు.ఈ ఘటన లో నర్సింలు కు గాయాలు కాగా అతడి కుమారుడు పరశురాములు దుబ్బాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. ఈ నెల శనివారం 9 మందిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచాం, మెజిస్ట్రేట్ ఉత్తర్వులు మేరకు కరీంనగర్ సెంట్రల్ జైలుకు పంపించామని ఎస్ఐ గంగరాజు తెలిపారు.