సైఫ్ అలీఖాన్‌పై దాడి

నవతెలంగాణ ముంబయి: బాలీవుడ్‌ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. ఓ గుర్తుతెలియని వ్యక్తి సైఫ్ ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్‌ గాయపడటంతో కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. దుండగుడిని గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ దాడిలో  సైఫ్ అలీఖాన్‌కి ఆరుచోట్ల గాయాలయ్యాయి.

Spread the love