మహిళా రెజ్లర్లపై దాడి అమానుషం

– పీఓడబ్ల్యు, పీడీఎస్‌యు, ఐఎఫ్‌టీయు నాయకులు
-కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-అడిక్‌మెట్‌
న్యాయ పోరాటం చేస్తున్న మహిళా రెజ్లర్లపై దాడి చేసి, అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేయడాన్ని అమా నుషం అని పీఓడబ్ల్యు, పీడీఎస్‌ యు, ఐఎఫ్‌టియు నాయ కులు అన్నారు. ఈ మేరకు సోమవారం విద్యానగర్‌ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పి ఓ డబ్ల్యు జాతీయ కన్వీనర్‌ వి సంధ్యక్క మాట్లాడుతూ 28 మే, 2023న న్యూ ఢిల్లీలోని కొత్త పార్లమెంట్‌ భవనం సమీపాన రెజ్లర్ల నిరసన ప్రదర్శన జరుగుగుతున్న సందర్భంగా పోలీసులు రెజ్లర్లు సాక్షి మాలిక్‌, వినేష్‌ ఫోగట్‌ తదితరులపై దారుణంగా దాడిచేసి, అక్రమ నిర్బంధానికి గురిచేసి, కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.జాతీయ రాజధాని నుండి పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది ఒలంపిక్‌-పథకాలు గెలు చుకున్న రెజ్లర్‌లను ఈడ్చుకెళ్లి నిర్బంధించినట్లు చూపుతున్న భయంకరమైన దశ్యాలు దేశ ప్రజానీకానికి, మహిళా లోకానికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మహిళలలో ఆత్మ విశ్వాసాన్ని, క్రీడా స్ఫూర్తిని పూర్తిగా దెబ్బతీస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపులకు గురైన మహిళా మల్లయోధులు, మరికొందరు క్రీడాకారులు నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయమని అడిగిన పాపానికి ఒలిపిక్‌ ఛాంపియన్స్‌ సాక్షి మాలిక్‌, వినేష్‌ ఫోగట్‌ తదిత రు లును పార్లమెంటు భవనానికి కూతవేటు దూరంలో అరెస్టు చేశారు. పోలీసుల చేత దాడులకు, అరెస్టులకు గురయ్యారు అని తెలిపారు.బ్రిజ్‌ భూషణ్‌ చరణ్‌ సింగ్‌ ని అరెస్టు చేసి పార్లమెంట్‌ సభ్యత్వాన్ని, రాజకీయ ప్రాతినిధ్యంతో సహా అన్ని పదవుల నుండి అతనిని తొలగించాలని డిమాండ్‌ చేశారు. మహిళా రెజ్లర్లపై జరిగిన లైంగిక వేధింపులపై సుప్రీం కోర్టు జడ్జ్‌ చే సమగ్ర న్యాయ విచారణ జరిపిం చా లి. మేరీ కోమ్‌ నివేదికను వెల్లడించి తగిన చర్యలు చేపట్టాలి. పోరాడుతున్న మహిళా మల్ల యోధులకు రక్షణ కల్పిం చాలి అని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి.అనురాధ, పిఓడబ్ల్యు రాష్ట్ర ఉపా ధ్యక్షురాలు సరళ, బండారు విజయ, పిడిఎస్యు గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి పోడపంగి నాగరాజు, జిల్లా నాయకురాలు ధరణి, సెంట్రల్‌ జోన్‌ ప్రధాన కార్యదర్శి తీగల శ్యామ్‌, ఝాన్సీ, సర్వేశ్‌, అశోక్‌, రేణుక పాల్గొన్నారు.
మహిళలపై కేంద్ర ప్రభుత్వం విపక్ష
తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి కోట నీలిమ
అంబర్‌పేట : తమకు న్యాయం చేయాలనీ ఢిల్లీలో శాంతి యుతంగా ప్రదర్శన నిర్వ హిస్తున్న మహిళా రెజ్ల ర్లపై క్రూరమైన బలప్రయోగం చేసి నిర్బంధించడం తీవ్రమైన మానవ హ క్కుల ఉల్లంఘన అని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రె స్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి కోట నీలిమ ఆగ్రహం వ్యక్తం చేసారు. హైదరాబాద్‌ తన కార్యాలయం నుండి సోమ వారం ఒక ప్రక టనలో ప్రధాని మోడీ పాలనలో భారత దేశం నేడు మహి ళలకు అత్యంత ప్రమాదకరమైన ప్రదశంగా మారిందని రక్షించవలసిన పోలీసులే రాక్షసులుగా వ్యవహరిస్తున్నారని కోట నీలిమ మండిపడ్డారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రీజ్‌ భూషణ్‌ శరన్‌ సింగ్‌ చర్యలు తీసుకోవాలని శాంతియుత ప్రదర్శనకా రులను అణిచి వేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీ నంలోఉన్న ఢిల్లీ పోలీ సులు క్రూరంగా ప్రవర్తించి వారిని పట్టుకొని దుర్భాషలా డుతూ నిర్బంధించడం, హదయ విదారక మైన దశ్యలు చూసి మోడీ నియంతత్వ పాలనా, అప్రజాస్వామిక సం స్కతి అసలు రూపం బయటపడిం దని ఆమె తెలిపారు. ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద 36 రోజుల పాటు కొనసాగిన మహిళా రెజ్లర్ల నిరసనను మే 28న దారుణంగా అడ్డుకొని అణిచివేయడాన్ని ఆమె తీవ్రం గా ఖండించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహి ళలను అగౌరవపరిచే విధా నాలు అవలంబించడం కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో మహి ళలంతా ఏకమై ఓడించి తీరుతారని కోట నీలిమ హెచ్చరించారు.

Spread the love