ఇరు వర్గాల దాడులు

నవతెలంగాణ – మహాముత్తారం
అసెంబ్లీ ఎన్నికలు సమిపిస్తున్న వేళ మంథిని నియోజకవర్గం లొ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మారుమూల అటవీ ప్రాంతంలో ప్రచారంలో భాగంగా భారస, కాంగ్రెస్ నాయకులు పరస్పరం దాడులు చేసుకుంటున్న సంఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భారస, కాంగ్రెస్ నాయకులు నల్లకుంట మీనాజీపేటలో గ్రామపంచాయతీ పరిధిలోని కిష్టాపూర్ లో ప్రచారం చేసుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడుల్లో మహోత్సవం మండలానికి చెందిన మాజీ జెడ్పిటిసి మందల రాజిరెడ్డికి గాయాలయిస్తృహకోలిపోగా, మంథి ని ముత్తారం ఒడెడ్ గ్రామానికి చెందిన సర్పంచ్ సిరికొండ బక్కరావుకి గాయాలైనట్టు తెలిపారు. దాడుల్లో అనంతరం కార్యకర్తలు మీనాజీ పేటకు వెళ్ళి ఆందోళన చేపట్టారు.

Spread the love