నవతెలంగాణ -ఢిలీ: ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించడంతో కలకలం రేగింది. ఇండిగో విమానం 6ఈ6341 విమానం గత రాత్రి పొద్దుపోయాక ఢిల్లీ నుంచి చెన్నై బయలుదేరింది. విమానం డోర్ తెరిచే ప్రయత్నం చేసిన వ్యక్తిని మణికందన్‌గా గుర్తించారు. విమానం చెన్నైలో ల్యాండ్ అయిన వెంటనే అతడిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధికారులకు అప్పగించారు. ఇండిగో అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.