బాలికపై లైంగిక దాడికి యత్నం

Attempt to sexually assault a girlనవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ నగరంలోని 5వ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై లైంగిక దాడికి యత్నం జరిగిందని ఐదవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గంగాధర్ శనివారం తెలిపారు.
బాలికపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిపై పోక్సో కేసు చేసామన్నారు. నిజామాబాద్ ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగర వాసి అజీమ్(56 ) ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అజీమ్ మహిళ ఇంటికి వెళ్లి ఆమె కూతురిని బెడ్రూం కు తీసుకెళ్తుండగా గమనించిన తల్లి కొట్టడంతో అక్కడి నుంచి పరారయ్యాడని చెప్పారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై వివరించారు.
Spread the love