ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నం

నవతెలంగాణ – నవీపేట్
మండల కేంద్రంలోని ఎర్ర సాయన్న దుకాణం ఎదురుగా గల ఎస్బీఐ ఎటిఎంలో బుధవారం తెల్లవారుజామున చోరీకి యత్నించారు.  నార్త్ రూరల్ సిఐ సతీష్, ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 4:30 సమయంలో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు ఏటీఎంలోకి చొరబడి చోరీకి యత్నించగా సిస్టం అలారం ఆధారంగా పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన ఏటీఎం దగ్గరికి వెళ్లి చూడగా ఎవరు కనిపించలేదు. ఎటువంటి నగదు చోరీకి గురి కాకపోవడంతో క్లూస్ టీం ను పిలిపించి విచారణ చేపట్టారు. బ్యాంకు సిబ్బంది ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Spread the love