ముస్లిం మహిళా పై లైంగికదాడికి యత్నం.?

Sexual assault on Muslim women?– మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం
– ఆలస్యంగా వెలుగులోకి
నవ తెలంగాణ మల్హర్ రావు.
ఓ ముస్లిం వివాహిత మహిళపై అధికారపార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి లైంగికదాడికి ప్రయత్నం చేయగా, సదరు మహిళ మనస్తాపంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండల కేంద్రమైన తాడిచెర్లలో చోటుచేసుకున్న సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ విఘాద సంఘటన బయటకు పొక్కకుండా సెటిల్ మేంట్ చేసినప్పటికీ అనోటా ఈనోటా పడి చివరికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.స్థానికుల కథనం ప్రకారం ఈ నెల 17న రాత్రి బాధితురాలు బాత్రూంలో స్నానం చేస్తుండగా ఆ చోటా ప్రజాప్రతినిధి కంటపడింది.ఇంకేముంది ఆమెపై హత్యాచార యత్నానికి ప్రయత్నం చేయగా ఆమె కేకలు,అరుపులు వేయడంతో సదరు ఆ వ్యక్తి బైక్ వదిలి పరుగులు తీసినట్లుగా తెలిసింది.విషయం బయటకు పొక్కడంతో బాధిత మహిళ మనస్తాపానికి గురై ఈ నెల 19న రాత్రి పురుగుల మందు సేవించింది.చికిత్స కోసం కుటుంబ సభ్యులు భూపాలపల్లి జిల్లా కేంద్రములోని ప్రభుత్వ వందపడకల ఆసుపత్రికి తరలించారు.బాధితురాలు కొయ్యుర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.కేసుకు సంబంధించిన పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Spread the love