అటెండర్‌ రాజు కుటుంబానికి సంపూర్ణ సహకారం

శంకర్‌పల్లి ఎంఈవో సయ్యద్‌ అక్బర్‌
నవతెలంగాణ-శంకర్‌పల్లి
దివంగత అటెండర్‌ రాజు కుటుంబానికి సంపూర్ణ సహకారం ఉంటుందని శంకర్పల్లి ఎంఈఓ సయ్యద్‌ అక్బర్‌ అన్నారు. శంకర్‌పల్లి మండల కేంద్రంలో దివంగత చేవెళ్ల రాజు అకాలంగా మృతి చెందడంతో సంతాప సభ నిర్వహించారు. రాజు కుటుంబానికి శంకర్పల్లి మండలాలలోని ఉపాధ్యాయులు, ఇతర మండల ఉపాధ్యాయులు కలసి రూ.లక్షలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుడు రాజు కుటుంబానికి ఉపాధ్యాయ జేఏసీ తరపున శంకర్పల్లి మండలంలోని కాకుండా ఇతర మండల చెందిన ఉపాధ్యాయులందరూ కలసి రూ.2లక్షలు ఎస్బిఐ శంకర్‌పల్లి బ్యాంకులో ఫిక్స్డ్‌ డిపాజిట్‌ చేసినట్టు చెప్పారు. డిపాజిట్‌ చేయడంలో కీలక పాత్ర వహించిన శంకర్పల్లి మండలం ఉపాధ్యాయ జేఏసీ, టీఎస్‌జీహెచ్‌ఎంఏ, ఎస్‌టీయూ, పీఆర్టీయూ, టీఎస్‌ యూటీఎఫ్‌, టీపీ యూఎస్‌, టీఎస్‌సీపీఎస్‌ఈయూ సంఘాల నాయకులకు, దీనికి సంపూర్ణ సహ కారం అందజేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. వీరి కుటుం బానికి, కుమారుని చదువు కోసం భవిష్యత్‌లో ఎంతటి సహాకారానికైనా సహ కారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు నరహరి, జయసింహారెడ్డి, సురేందర్‌రెడ్డి, తెలంగాణ మోడల్‌ స్కూల్‌ ప్రిన్సి పాల్‌ ఉమామహేశ్వర్‌, తాహిర్‌ అలీ, రాజశేఖర్‌ ,శివకుమార్‌, శ్రీనివాస్‌ , పాపా గారి ఆశీర్వాదం, యాదయ్య, బాల్‌రాజ్‌, కృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, వనజ, పద్మజా, నగేశ్‌, సదాలక్ష్మి, రాములు, గోపాల్‌, అసఫ్‌ఖాన్‌ రవికాంత్‌ రెడ్డి, వెంకటేష్‌, భక్తప్ప, హరి, రాజేశ్వరి, ప్రణీత, ఉపాధ్యాయులు సీఆర్పీలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love