అభివృద్ధి పనులకు అకర్షితులమై బిఅర్ఎస్ లో చేరినం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన సుమారు వందమంది బిఆర్ఎస్ పార్టీలో యువకులు బుధవారం ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో పార్టీ మండల అధ్యక్షులు చిలువెరి గంగా దాస్ అధ్వర్యంలో చేరారు.చేరిన వారందరికీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కాండువ కప్పి ఆహ్వానించారు.ఈసందర్బంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం,రూరల్ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చేస్తున్న పనులకు అకర్షితులమై బిఅర్ఎస్ లో చేరినట్లు వివరించారు.తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్, బాజిరెడ్డి గోవర్ధన్ లు ఇంకా అభివృద్ధి చేస్తరనే పూర్తి నమ్మకం ఉందని వారన్నారు.ఈ కార్రయక్రమం లో ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్ రూరల్ ఎస్సీ సెల్ కన్వీనర్ పాశం కుమార్,  బోడ్డు గంగాధర్, తాళ్ల గంగాధర్ గౌడ్, రవి, పట్టేపురం గంగాధర్, సతీష్ కుమార్, అవసుల రాజేష్, గ్రామ శాఖ అధ్యక్షులు గంగాధర్, గణేష్ కుమార్ ,వీడియో గంగాధర్, నాయిని అశోక్, బొద్దుల సతీష్ ,వడ్ల శ్రీనివాస్, హౌస్ల రఘు, ఆవుల మైపాల్, మంగలి నరేందర్, దోమకొండ రంజిత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love