రెండో టెస్ట్‌లో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం..

నవతెలంగాణ – హైదరాబాద్: అడిలైడ్‌ టెస్ట్‌లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. ఈ టెస్ట్‌లో అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌తోనూ అద్భుత ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా.. టెస్ట్‌ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక మూడో టెస్ట్‌ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్‌లో జరగనుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 18 పరుగుల లక్ష్యం బరిలోకి దిగింది. వికెట్‌ నష్టపోకుండా 19 పరుగులు చేసి.. లక్ష్యాన్ని చేరుకున్నది. ఓపెనర్లు ఉస్మాన్‌ ఖవాజా (9), నాథన్ మెక్‌స్వీనీ (10) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇదిలా ఉండగా.. భారత్ రెండో ఇన్నింగ్స్ 175 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 180 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 175 పరుగులు చేసి ఆస్ట్రేలియాపై 18 పరుగుల ఆధిక్యం సంపాదించి కంగారూలకు 19 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఐదు వికెట్ల నష్టానికి 128 పరుగుల వద్ద ఆదివారం ఆట ప్రారంభించిన టీమిండియా 47 పరుగుకే ఐదు వికెట్లను కోల్పోయింది. రిషబ్ పంత్ రూపంలో టీమ్ ఇండియాకు తొలి దెబ్బ తగిలింది. 28 పరుగులు చేసి స్కార్క్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. ఆ తర్వాత అశ్విన్‌ (7), హర్షిత్‌ రాణా (0), నితీశ్ రెడ్డి (42), సిరాజ్‌(7) స్కోర్‌ మాత్రమే చేయగలిగారు. టీమిండియా తరఫున అత్యధిక స్కోర్‌ చేసింది నితీశ్‌ కుమార్‌రెడ్డి మాత్రమే. అతను 47 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌర్లలో కెప్టెన్‌ కమిన్స్‌ ఐదు వికెట్లు తీయగా.. బోలాండ్‌కు మూడు వికెట్లు, స్టార్క్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన ట్రావిస్‌ హెడ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Spread the love