టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

నవతెలంగాణ- హైదరాబాద్ : సిరీస్ డిసైడ‌ర్ అయిన నాలుగో టీ20లో ఆస్ట్రేలియా, భార‌త్ ఢీ కొంటున్నాయి. రాయ్‌పూర్‌లో జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ బౌలింగ్ తీసుకున్నాడు. కీల‌క‌మైన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఐదు మార్పుల‌తో బ‌రిలోకి దిగుతోంది. మార్క‌స్ స్టోయినిస్, మాక్స్‌వెల్, ఇంగ్లిస్, రిచర్డ్‌స‌న్‌, ఎల్లిస్ స్థానంలో కొత్త‌వాళ్ల‌కు చాన్స్ ఇచ్చారు. ఇక భార‌త జ‌ట్టు ప్ర‌సిధ్ స్థానంలో ముకేశ్‌, అర్ష్‌దీప్ స్థానంల్ దీప‌క్ చాహ‌ర్, తిల‌క్ వ‌ర్మ ప్లేస్‌లో శ్రేయాస్ అయ్య‌ర్, ఇషాన్ కిష‌న్ బ‌దులు జితేశ్ శ‌ర్మను ఆడించ‌నుంది.
భార‌త జ‌ట్టు : య‌శ‌స్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయ‌స్ అయ్య‌ర్, సూర్య‌కుమార్ యాద‌వ్‌(కెప్టెన్), జితేశ్ శ‌ర్మ‌(వికెట్ కీప‌ర్), రింకూ సింగ్, అక్ష‌ర్ ప‌టేల్, ర‌వి బిష్ణోయ్, దీప‌క్ చాహ‌ర్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్.

ఆస్ట్రేలియా జ‌ట్టు : జోష్ ఫిలిప్పే, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్‌, అరోన్ హ‌ర్డీ, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మాథ్యూ వేడ్(వికెట్ కీప‌ర్, కెప్టెన్), బెన్ డ్వార్‌షుయిస్, క్రిస్ గ్రీన్, జేస‌న్ బెహ్రెన్‌డార్ఫ్, త‌న్వీర్ సంగా.

Spread the love