అవగాహనతో ఆటిజం జయించడం సులభం

– డాక్టర్‌ మురళీకష్ణ
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
అవగాహనతోనే ఆటిజంను జయించొచ్చని, తల్లి దండ్రులకు సరైన అవగాహన లేక, ప్రాథమిక దశలో పిల్ల ల్లో వచ్చే బుద్ది మాంద్యం సమస్యను గుర్తించకపో వడం తోనే అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని దివీస్‌ ల్యాబ్‌ ఎండి డాక్టర్‌ మురళీ కష్ణ దివి అన్నారు. ప్రపంచ ఆటిజం డే సందర్భంగా బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పా ర్కు వద్ద దివీస్‌ ఫౌండేషన్‌ ఫర్‌ గిఫ్టెడ్‌ చిల్డ్రన్‌ ఆధ్వర్యంలో ఆటిజం అవగాహన నడక నిర్వ హించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాధిపై ప్రతీ ఒక్కరికి అవగా హన ఉం డాల్సిన అవసరం ఉందని చిన్న వయసులోనే గుర్తిస్తే త్వరగా ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చున న్నా రు. తమ సంస్థ తరపున ఆటిజంతో బాధపడుతున్న చిన్నా రుల స్వాంతన కోసం వారు ఆ సమస్య నుంచి బయట పడేందుకు తగు చర్యలు తీసుకుం టున్నామని, అయినా కూడా దీని పట్ల అవగాహన ఎంతో అవసరమన్నారు. ఈ సందర్భంగా దివీస్‌ సంస్థకు చెందిన 300 మంది ఉద్యోగులతో పాటు వాకర్లు పెద్ద ఎత్తున ఈ అవగాహన నడకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ,దివీస్‌ ల్యాబ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎన్‌.వి.రమణ,సీఎఫ్‌ ఓ ఎల్‌.కిషోర్‌ బాబు వైస్‌ ప్రెసిడెంట్లు ప్రకాశ్‌ దివి,ఎల్‌.రమేష్‌ బాబు, డి.మధుబాబు, జీఎంలు కె.సుబ్బారావు,బి.వర ప్రసాద్‌, పి.సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love