జీవనోపాధి కల్పించాలని ఆటో డ్రైవర్ల నిరసన

నవతెలంగాణ-గుమ్మడిదల
కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం నిర్ణయం తీసుకోవడంతో ఆటో డ్రైవర్ల కుటుంబ పరిస్థితులు అధ్వానంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లుకు ఉపాధి కల్పించాలని కోరుతూ శనివారం గుమ్మడిదల మండలంలోని కానుకుంట ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళల పట్ల తీసుకున్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ నిర్ణయంతో ఆటో డ్రైవర్ల కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఆటోల ఫైనాన్స్‌ కూడా చెల్లించలేని పరిస్థితులకు దిగజారిపోయామని వాపోయారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్ల కుటుంబాలను బాగు చేయడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్ల యూనియన్‌ నాయకులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love